Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఘాటి’. విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్ కంటే కూడా ట్రైలర్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ‘పుష్ప’ స్టైల్లో సాగినప్పటికీ మాస్ ఆడియన్స్ కి అది రీచ్ అయ్యింది.

Ghaati Collections

అందువల్లే అనేక సార్లు వాయిదా పడినప్పటికీ ‘ఘాటి’ పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను ‘ఘాటి’ పూర్తి స్థాయిలో మ్యాచ్ చేయలేకపోయింది అనే చెప్పాలి. మొదటి రోజు సినిమాకి యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి.రెండో రోజు నుండి కోలుకుంటుంది అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. అలా ‘ఘాటి’ ఓపెనింగ్స్ డిజప్పాయింటింగ్ గానే ఉన్నాయి. ఒకసారి ‘ఘాటి’ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

 

 

నైజాం  0.55 cr
సీడెడ్  0.09 cr
ఆంధ్ర (టోటల్)  0.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  1.06 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.13 cr
ఓవర్సీస్  0.19 cr
మిగిలిన వెర్షన్లు   0.07 cr
వరల్డ్ వైడ్ టోటల్   1.45 cr (షేర్)

 

‘ఘాటి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.45 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.36 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.24.55 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.టాక్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చినప్పటికీ.. ఎందుకో క్యాష్ చేసుకోలేకపోతుంది. వీకెండ్ ముగిసేసరికి కనీసం 30 శాతం రికవరీ సాధించే విధంగా లేదు.

మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus