Ghaati: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఘాటి’. అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 5న విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో రాజీవ్ రెడ్డి నిర్మించారు. విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి.

Ghaati First Review

‘పుష్ప’ స్టైల్లో ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఫస్ట్ టైం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన పంధా మార్చుకుని కమర్షియల్ జోనర్లో చేసిన మూవీ ఇది. అనుష్క అయితే ఎటువంటి ప్రమోషన్స్ కి హాజరు కాలేదు. ఈ ప్రమోషన్స్ భారాన్ని అంతా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి మోయడం జరిగింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు సైతం చాలా గ్యాప్ తర్వాత ప్రమోషన్స్ కి హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో ‘ఘాటి’ ప్రత్యేకపై ఆడియన్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆల్రెడీ ‘ఘాటి’ని ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు, పెద్దలకు చూపించడం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.శీలావతి అనే ఖరీదైన గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటిలకు చెందిన వారు శీలావతి(అనుష్క) దేశి రాజు(విక్రమ్ ప్రభు).

అయితే వీళ్ళు మంచిగా మారాలి అనుకున్న టైంలో కుందుల్ నాయుడు(చైతన్య రావ్) కుటుంబం వీరికి చేసిన అన్యాయం ఏంటి? శీలావతిని నగ్నంగా అవమానించి… దేశి రాజుని ఏం చేశారు? తర్వాత ‘ఘాటి’ వాళ్ళ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనేది మిగిలిన సినిమాగా తెలుస్తుంది.కమర్షియల్ ఎలిమెంట్స్ తో ‘ఘాటి’ ని రూపొందించినప్పటికీ క్రిష్.. తన మానవతా విలువలు ఎక్కడా మిస్ చేయలేదు అంటున్నారు. మరి సెప్టెంబర్ 5న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus