సూర్య సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది అంటే అది ‘గజిని’ సినిమా వల్ల ఏర్పడిందే అని చెప్పాలి. అంతకు ముందు సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చిన సూర్య ‘గజిని’ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2005వ సంవత్సరం సెప్టెంబర్ 29న తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్ అవ్వడంతో ‘గజిని’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజుతో ‘గజిని’ విడుదలై 16 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.72 cr |
సీడెడ్ | 1.67 cr |
ఉత్తరాంధ్ర | 1.74 cr |
ఈస్ట్ | 0.65 cr |
వెస్ట్ | 0.57 cr |
గుంటూరు | 0.79 cr |
కృష్ణా | 0.66 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.16 cr |
‘గజిని’ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్, ఠాగూర్ మధు వంటి బడా నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.11.16 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాం,సీడెడ్ వంటి ఏరియాల్లో తమిళ్ వెర్షన్ ను కూడా విడుదల చేశారు కానీ వాటి లెక్కలు మాత్రం బయటకి రాలేదు. తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ‘గజిని’ 3 రెట్లు బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పొచ్చు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!