Ghani OTT: ‘గని’ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్మెంట్!
- April 18, 2022 / 07:52 AM ISTByFilmy Focus
యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో మాత్రం బాక్సర్ గా కనిపించారు. తన పాత్ర కోసం చాలానే కష్టపడ్డారు. బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నారు. గంటలు తరబడి జిమ్ లో కష్టపడి బాడీను బాగా పెంచారు. ఆయన ఇంత కష్టపడినా.. రిజల్ట్ మాత్రం అనుకూలంగా రాలేదు.
ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై వరుణ్ తేజ్ స్వయంగా స్పందించారు. ఎంత కష్టపడినా.. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రేక్షకులకు వినోదం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సినిమా చేస్తానని.. కొన్నిసార్లు సక్సెస్ అవుతాను. కొన్నిసార్లు పాఠాలు నేర్చుకుంటానని.. హార్డ్ వర్క్ చేయడం మాత్రం మాననని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

నిజానికి ఏ సినిమా రిలీజైనా నాలుగైదు వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ‘గని’ సినిమా అయితే విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ‘ఆహా’ నిర్వాహకులు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మించిన ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు.
Kanivini yerugani style lo vastunnadu #GhaniOnAHA. Gear up to witness the Mega Prince @IAmVarunTej in this action family drama on 22nd April.
@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/Y7Lz5DZk4K
— ahavideoin (@ahavideoIN) April 17, 2022
‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!












