ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దివంగత ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఈ రోజు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఈ రోజు ఉదయం గుండెపోటుతో రత్నకుమార్ తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రత్నకుమార్ డయాలసిస్‌పై ఉన్నారు. రెండు రోజుల క్రితం చేసిన కొవిడ్ 19 పరీక్షలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి సుపరిచితులే. చాలా సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు.
ఈ క్రమంలో ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి రికార్డు కూడా సాధించారు. 35 ఏళ్లకుపైగా ఆయన డబ్బింగ్ రంగంలో అనుభవం సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృతంలో వెయ్యికిపైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగు, తమిళ సీరియళ్లలో 10 వేల ఎపిసోడ్లకుపైగా అనువాదం చెప్పిన అనుభవం ఆయనది. దీంతోపాటు 50 డాక్యమెంటరీలకు కూడా ఆయన గొంతు అందించారు. ప్రముఖ గాయకుడి తనయుడిగా గాయకుడిగానే జీవితం ప్రారంభించారు రత్నకుమార్. అయతే ఆ రంగంలో సరైన బ్రేక్ రాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారి, ఇందులో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన సినిమా రంగానికి అందించిన సేవలకు గాను రాష్ట్రప్రభుత్వం నుండి నంది పురస్కారం అందుకున్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం నుండి కళైసెల్వమ్ అనే బిరుదు పొందారు. దక్షిణ భారత సినీ, టీవీ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్.. రత్నకుమార్‌ను కురళ్‌సెల్వమ్ బిరుదుతో సత్కరించింది. దాంతోపాటు మద్రాస్ తెలుగు అసోసియేషన్ రత్నకుమార్‌కు ఉగాది పురస్కారం కూడా అందించింది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!