Pokiri Movie: మహేష్ ఫ్యాన్ కు పోకిరి చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి మూవీ అప్పట్లో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే గుంటూరు జీజీహెచ్ లో ఒక వ్యక్తికి పోకిరి సినిమా చూపిస్తూ విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. ఆ వ్యక్తి మహేష్ అభిమాని కావడం, చికిత్స సమయంలో ఆ వ్యక్తి మెలుకవగా ఉండాలని వైద్యులు ఈ విధంగా చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇలపర్రుకు చెందిన 48 సంవత్సరాల వయస్సు ఉన్న కోటి పండు అనే వ్యక్తి గత నెల 2వ తేదీన అపస్మారక స్థితిలో జీజీహెచ్ లో చేరారు. ఆ సమయంలో వైద్యులు పరీక్షలు చేయగా కోటి పండు మెదడులో కణితి ఉన్నట్టు తెలిసింది. ట్యూమర్ తొలగించే సమయంలో తప్పు చేస్తే కుడిచెయ్యి, కుడికాలు చచ్చుపడే అవకాశం ఉండటంతో రోగి మెలుకువగా ఉన్న సమయంలోనే వైద్యులు అతని అనుమతితో ఆపరేషన్ చేశారు.

కోటి పండు ఫేవరెట్ హీరో మహేష్ బాబు కావడంతో (Pokiri Movie) పోకిరి సినిమాను చూపిస్తూ గత నెల 25వ తేదీన ఆపరేషన్ చేశామని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. కోటి పండుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ విదేశాల నుంచి భారత్ కు వచ్చేశారు. మహేష్ బాబు త్వరలో రాజమౌళి మూవీ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన నేపథ్యంలో ఈ సినిమా వేగంగా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. మహేష్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus