Ginna Collections: మంచి టాక్ వచ్చినా.. మంచి ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది..!

విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘అవా ఎంటర్‌టైన్‌మెంట్‌’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈషాన్ సూర్య ‘జిన్నా’ కి దర్శకత్వం వహించాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే మాత్రం కోన వెంకట్ అందించడం జరిగింది.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్.. హీరోయిన్స్‌ . దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘జిన్నా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం నిరాశపరిచాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.05 cr
సీడెడ్ 0.02 cr
ఆంధ్ర(టోటల్) 0.07 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్ + మిగిలిన వెర్షన్లు
0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.19 cr

‘జిన్నా’ చిత్రానికి రూ.4.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.19 కోట్లు షేర్ ను రాబట్టింది.మొదటి రోజు చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. పాజిటివ్ టాక్ వచ్చినా ఇలా నెగిటివ్ షేర్స్ రావడం ఏంటో.. అర్థం కాని పరిస్థితి. ఇక బ్రేక్ ఈవెన్ కు రూ.4.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అది అంత ఈజీ టాస్క్ కాదు. రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. పోటీగా ‘ప్రిన్స్’ ‘ఓరి దేవుడా’ ‘సర్దార్’ వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే ‘కాంతారా’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తూ స్ట్రాంగ్ గా ఉంది. అయినప్పటికీ దీపావళి సెలవు ముగిసేవరకు ‘జిన్నా’ కి ఛాన్స్ ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus