LIGER Teaser: వి ఆర్ ఇండియన్స్.. విజయ్ హై వోల్టేజ్ లుక్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి కూడా లైగర్ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక సినిమాకు సంబంధించిన వరుస హిట్స్ తో చిత్ర యూనిట్ సభ్యులు హడావిడి మొదలు పెట్టేశారు.

ఇక సినిమాకు సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో రౌడీ స్టార్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ కు మంచి కిక్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి నేడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఒక ముంబాయి స్లమ్ ఏరియాలోని కుర్రాడు ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనే అంశం ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చేశారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పూరి జగన్నాథ్ స్టైల్ కు దగ్గరగానే కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ వి ఆర్ ఇండియన్స్ అంటూ స్ట్రాంగ్ గా చెప్పడం హైలెట్ గా నిలుస్తోంది. చూస్తుంటే డైలాగ్ గట్టిగానే వైరల్ అయ్యేలా ఉందని అర్థమవుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఏలాంటి సినిమా చేసినా కూడా అందులో హీరో పాత్ర మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఇక ఇందులో కూడా అదే తరహాలో కనిపిస్తాడని క్లారిటీ గా అర్థమైంది. లైగర్ సినిమాను 2022 ఆగస్టు 22 న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అసలైతే ఈ ఏడాది లోనే రావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 2022 సమ్మర్లో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని ఆగస్ట్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!


83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus