Chiranjeevi: గాడ్ ఫాదర్ లో ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయా?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్ ను ప్రకటించకపోయినా దసరా పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు చిరంజీవి నయనతార కాంబో సీన్స్ హైలెట్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చిరంజీవి నయనతార ఈ సినిమాలో పోటాపోటీగా నటించారని వీళ్లిద్దరి కాంబో సీన్లు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా లూసిఫర్ రీమేక్ లో అనేక మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది. గాడ్ ఫాదర్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి బాడీగార్డ్ గా కొన్ని నిమిషాల పాటు సల్మాన్ ఖాన్ కనిపిస్తారని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా చిరంజీవి సల్మాన్ ఖాన్ కాంబో సీన్లు కూడా ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయని సమాచారం అందుతోంది.

చిరంజీవి నయనతార అన్నాచెల్లెళ్లుగా నటిస్తుండటంతో నయనతార ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా గాడ్ ఫాదర్ తో చిరంజీవి మెగా ఫ్యాన్స్ కోరుకున్న విజయాన్ని సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో విజయాన్ని అందుకుంటే రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నీ వచ్చే ఏడాది మార్చి సమయానికి థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus