God Father OTT: నాగార్జున వచ్చేశాడు.. చిరంజీవి వచ్చేస్తున్నాడు!

దసరాకు థియేటర్లలోకి వచ్చిన ఇద్దరు స్నేహితులు… ఒకే ఓటీటీ ద్వారా ఇళ్లకు వస్తున్నారని మనం గతంలోనే చదువుకున్నాం. ఇప్పుడు అందులో ఒక స్నేహితుడు ఓటీటీలోకి వచ్చేశాడు. ఇంకో స్నేహితుడు డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది.. ఆ స్నేహితులు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనేది. అవే ‘ఘోస్ట్‌’, ‘గాడ్‌ఫాదర్‌’. ఈ సినిమాల ఓటీటీల సంగతులు వచ్చేశాయి. నాగార్జున సినిమా ఇప్పటికే వచ్చేయగా.. చిరంజీవి సినిమా డేట్ ప్రకటించారు.

చిరంజీవి కథానాయకుడిగా జయం మోహన్‌రాజా తెరకెక్కించిన సినిమా ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా.. అక్టోబరు 5న విడుదలైన విషయం తెలిసిందే. భారీ విజయం అంటూ.. తొలుత చెప్పినా.. లాంగ్‌ రన్‌లో సినిమాకు సరైన వసూళ్లు రాలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. నవంబరు 19 నుండి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక నాగార్జున – ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్‌’.

దసరా కానుకగానే అక్టోబరు 5న వచ్చిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబరు 2 నుండి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేశారు. థియేటర్లలో సరైన ఫలితం అందుకోని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’కి ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాత ఓటీటీలోకి సినిమాలు అని, ఆ మద్య నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఆ నియమం ఈ సినిమాలకు కూడా వర్తించదు అని రిలీజ్‌ డేట్‌ల వల్ల తెలిసింది. మరి ఎప్పటి నుండి ఈ సినిమాల స్పెషల్‌ రూల్‌ వర్తిస్తుందో నిర్మాతలే చెప్పాలి. ఈ సినిమాలను నిర్మించిన మెయిన్‌ స్ట్రీమ్‌ నిర్మాతలే కావడం విశేషం. మరి ‘గాడ్‌ఫాదర్‌’, ‘ఘోస్ట్‌’ విషయంలో ఆ రూల్స్‌ ఎందుకు పాటించలేదో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus