God Father Teaser: చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే.. కానీ?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది విడుదలైన ఆచార్య ఫలితం చిరంజీవికి షాకిచ్చినా గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ ఖాతాలో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రీఎంట్రీలో వరుసగా సినిమాలలో నటిస్తున్న చిరంజీవి రిస్క్ లేని, వయస్సుకు తగిన సబ్జెక్ట్ లను ఎంచుకోవాలనే ఆలోచనతో లూసిఫర్ రీమేక్ కు ఓకే చెప్పారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా కథలో కీలక మార్పులు చేశారని ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు సైతం గాడ్ ఫాదర్ కచ్చితంగా నచ్చుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. రీఎంట్రీలో చిరంజీవి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్ టీజర్ విడుదలైంది.

టీజర్ లో ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటున్నారో చిరంజీవి అదే విధంగా కనిపించారు. దర్శకుడు మోహన్ రాజా చిరంజీవిని స్టైలిష్ గా చూపించారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజర్ చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా విడుదలైనా సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

నయనతార “ఇక్కడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు” అనే డైలాగ్ తో ఆకట్టుకున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబో సీన్లు టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సత్యదేవ్ టీజర్ లో కొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. చిరంజీవి ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus