మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఫస్ట్ డే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదు అనిపించాయి. మొదటి వారం ఈ మూవీ పర్వాలేదు అనిపించినా.. రెండో వారం మాత్రం పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది.’కాంతార’ ఎఫెక్ట్ వల్ల ఈ మూవీ కోలుకోలేకపోయింది. 4 కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇంకా నలిగిపోయింది అని చెప్పాలి. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 12.32 cr |
సీడెడ్ | 9.58 cr |
ఉత్తరాంధ్ర | 5.97 cr |
ఈస్ట్ | 3.87 cr |
వెస్ట్ | 2.44 cr |
గుంటూరు | 4.05 cr |
కృష్ణా | 2.93 cr |
నెల్లూరు | 2.11 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 43.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.71 cr |
హిందీ | 5.18 cr |
ఓవర్సీస్ | 5.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 58.36 cr (షేర్) |
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.92 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.58.36 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.33.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదు. కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడం వలన దీపావళికి ఎటువంటి మెరుపులు మెరిపించలేకపోయింది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!