‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT) ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT 2) చిత్రాలతో హిట్లు కొట్టి.. మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ అనిపించుకున్నాడు శైలేష్ కొలను (Sailesh Kolanu). ఆ తర్వాత వెంకటేష్ తో (Venkatesh) ‘సైందవ్’ (Saindhav)చేసే ఛాన్స్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఈ రోజుల్లో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. వెంకటేష్ కి స్క్రిప్ట్ నచ్చినా.. సురేష్ బాబు కూడా విని ఫైనల్ చేయాల్సిందే.
అలాంటి సురేష్ బాబుని కూడా ఒప్పించి ‘సైందవ్’ చేసే ఛాన్స్ పొందాడు శైలేష్. ఆ విషయంలో అతను సక్సెస్ అయినా.. సినిమా మాత్రం ఫెయిల్ అయ్యింది. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం, వెంకటేష్ ఇమేజ్ కి పూర్తిగా రివర్స్ లో ఆ సినిమా కథ, కథనాలు ఉండటం వల్ల.. అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కొన్ని నెలల పాటు అతను ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
అయితే నాని (Nani) అతనికి ‘హిట్ 3’ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. మొత్తానికి సినిమా రెడీ అయ్యింది. మే 1న రిలీజ్ కానుంది. హీరో నాని అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పైగా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు పడలేదు. దీంతో అందరూ ‘హిట్ 3’ వైపే చూస్తున్నారు.
మొదటి 2 పార్టులు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి.. దీనిపై కూడా ఆడియన్స్ ఫోకస్ ఉంది. ఏమాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తాయి. దీంతో కమర్షియల్ గా సినిమా సేఫ్ అవుతుంది. నాని ఎలాగూ సక్సెస్లలోనే ఉన్నాడు. శైలేష్ కి మాత్రం ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి