తల అజిత్ (Ajith Kumar) అంటేనే మాస్ హంగామా అని మరోసారి ప్రూవ్ చేసింది గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) చిత్రం. కథలో బలం లేకపోయినా.. రివ్యూలు మిక్స్‌డ్‌గా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అజిత్ ఫ్యాన్ పవర్ మామూలుగా లేదని చెప్పొచ్చు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో అదిరే ఓపెనింగ్స్‌తో తెగ దూసుకెళ్లింది. స్టోరీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోయినా, అజిత్‌కు స్పెషల్‌గా డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్సులు, మాస్ ఎలివేషన్స్ సినిమాకు బలంగా నిలిచాయి.
బీజీ బ్యాక్‌డ్రాప్, పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ అజిత్ స్టార్డమ్‌ను మరోసారి తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా అభిమానులు థియేటర్లలో ఫుల్ జోష్, కట్ అవుట్స్‌తో సందడి చేయడం సినిమాకు ఊపు తెచ్చింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మూవీ తమిళనాడులో మొదటి రోజే ₹21.85 కోట్లు వసూలు చేసింది. అజిత్ కెరీర్‌లోనే కాకుండా, కోలీవుడ్‌లో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.
విజయ్ (Vijay Thalapathy) నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT) రూ.20.66 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉండగా, అజిత్ ఇంతకుముందు చేసిన విదాముయర్చి (Pattudala) కూడా ₹18.21 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక రజినీకాంత్ వెట్టయన్ (Vettaiyan) ₹14.66 కోట్లు, సూర్య (Suriya) కంగువా (Kanguva) రూ.8.49 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. ఈ లెక్కన చూస్తే, తమిళనాట అజిత్ స్టార్ వాల్యూ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
అయితే, కథ బలహీనత కారణంగా మౌత్ టాక్ బలంగా లేకపోవడం వారం మొత్తం వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మాస్ ఫెస్ట్‌గా మొదలైంది. కానీ అదే స్పీడ్‌తో లాంగ్ రన్ కలెక్షన్లు కొనసాగుతాయా? లేక కథ కరువుతో డిక్లైన్ అవుతుందా? అన్నది చూడాలి.