దర్శకుల దూకుడు.. కొత్త దిశలోకి ఇండియన్ సినిమా!

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఓ విప్లవాత్మక మార్గంలో ప్రయాణిస్తోంది. కథలు చెప్పడమే కాకుండా, ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడమే దర్శకుల (Directors) లక్ష్యంగా మారింది. స్టార్ హీరోలు కాదు, ఇప్పుడు దర్శకులే అసలైన బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. కథ, టెక్నాలజీ, ఎమోషన్ మేళవింపుతో వాళ్లు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశలో ముందున్న దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) . మహేష్ బాబుతో (Mahesh Babu)   కలిసి చేస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB29‌ను పాన్ ఇండియా కాకుండా, పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు.

Directors

హాలీవుడ్ టెక్నిక్స్, అమెజాన్ అడవుల్లో షూటింగ్, ఇంటర్నేషనల్ క్యాస్టింగ్‌తో రాజమౌళి తన దృష్టిని గ్లోబల్ ఆడియెన్స్‌పై పెట్టాడు. సినిమా కంటెంట్ కూడా భారతీయ కథానాయకుడు ప్రపంచాన్ని చుట్టే విధంగా ఉంటుందన్న టాక్. ఇక ‘అర్జున్ రెడ్డి’తో (Arjun Reddy)  సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), ఇప్పుడు ‘స్పిరిట్’ (Spirit) ద్వారా మరో మాస్ ఎమోషనల్ డ్రామాతో వస్తున్నారు. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా, పోలీస్ కథా నేపథ్యంతో, గంభీరమైన సైకాలజికల్ షేడ్స్‌తో రూపొందనుందని సమాచారం.

ఇందులో ఇంటెన్స్ పాత్రలు, మానసిక ఘర్షణలు పెద్ద ఎత్తున ఉంటాయని టాక్. అలాగే, ‘జవాన్’ (Jawan) విజయం తర్వాత అట్లీ (Atlee Kumar) .. అల్లు అర్జున్‌తో (Allu Arjun) కలిసి సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్ ప్రపంచ స్థాయిలో ఉండబోతోందని చెబుతున్నారు. వీఎఫ్‌ఎక్స్, డీ ఏజింగ్ టెక్నిక్స్‌తో కొత్త లెవెల్‌ను చూపించనున్నాడు అట్లీ.

ఇక బాలీవుడ్‌లో నితీష్ తివారి (Nitesh Tiwari) డైరెక్షన్‌లో రూపొందుతున్న రామాయణం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణబీర్ (Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi)  లుక్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సినిమాటిక్‌గా ఆవిష్కరించే ప్రయత్నం ఈ ప్రాజెక్ట్‌లో కనిపిస్తోంది. ఇండియన్ సినిమా దర్శకుల (Directors) సాహసానికి ఇది నిదర్శనం. వాళ్లే ఇప్పుడు కథలు చెబుతున్న తీరుతో, ప్రపంచాన్ని ఇండియన్ సినిమా వైపు తిప్పిస్తున్నారు. మరి ఈ నూతన ప్రయోగాలు బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో ఊపేస్తాయో చూడాలి.

డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టి దర్శకులని ఇబ్బంది పెడుతున్న యంగ్ హీరోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus