“ఆశ” చిగురించింది- మేము సైతం

  • April 5, 2016 / 03:10 PM IST

ప్రార్ధించే పెదవుల కన్నా…సాయం చేసే చేతులు మిన్నా!!! నిజమే…సాటి మనిషి కష్టం మనది కాదు అని అనుకున్నప్పుడు ఈ సమాజంలో మన బ్రతుకుకు విలువ ఉండదు అని, తమ సెలెబ్రిటీ స్టేటస్ ను పక్కన పెట్టి మరీ, కష్టాల్లో ఉన్న కొన్ని జీవితాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు మన టాలీవుడ్ స్టార్. మంచు లక్ష్మి ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మేము సైతం’ అనే కార్యక్రమానికి అతిధులుగా బయలుదేరారు ఎందరో స్టార్స్. కార్యక్రమంలో మొదటి భాగంలో మూవీ ముఘల్ దగ్గుపాటి రామా నాయుడు గారి మనుమడు, సినిమా హీరో, బాహుబలి దగ్గుపాటి రాణా, నందమూరి తారక రామారావు గారి మనవరాలు,బాలకృష్ణ కుమార్తె,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు అయిన నారా బ్రాహ్మణి అక్కడకు వచ్చిన ఒక కుటుంబాన్ని ఆదుకునేందుకు సిద్దం అయ్యారు.

అందులో బాటిల్ వాటర్ సైతం పని వాళ్ళతో తెప్పించుకునే అంత స్టేటస్ ఉన్న రాణా..కూలీ వాడిగా మారి, ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న లక్ష్మి మంచు తో కలసి ఆ కుటుంబానికి 3లక్షల రూపాయలు అందించి ఆర్ధికంగా చేయూతనిచ్చారు. . ఇక నారా బ్రాహ్మణి మాట్లాడుతూ…చదువు యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ…ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లలు ఇద్దరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, అంతేకాకుండా 12వ తరగతి వరకూ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ సైతం ఉచితంగా అందిస్తామని ఆమె మాటగా తెలిపారు. ఇక బ్రేన్ ట్యూమర్ వల్ల కంటి చూపు కనపడని శ్రీలతకు, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత వైధ్యం అందిస్తామని డాక్టర్ తెలిపారు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus