Allu Arjun: బన్నీ పుట్టిన రోజునాడు బెంగాళీ స్వీట్‌ న్యూస్!

సినిమాల ప్రభావం… అంటూ అదేదో సినిమాలో స్టార్‌ హీరో అంటాడు గుర్తుందా? ఆ మాట విని నవ్వుకున్నారేమో కానీ, అలాంటి ప్రభావాలు ఒక్కోసారి తెగ నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి ఆ ప్రభావం భయం కూడా కలిగిస్తుంది. అలాంటి చిన్నపాటి భయమే కలిగింది పశ్చిమ బంగకు చెందిన ఓ టీచర్‌కు. దానికి కారణం ‘పుష్ప’ సినిమా. అవును మన సినిమానే అక్కడ టీచర్‌ను కాసేపు కంగారు పెట్టించింది. ఆ తర్వాత నవ్వు కూడా తెప్పించింది.

‘తగ్గేదేలే..’ అనే డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సినిమా వాళ్లే కాకుండా, క్రికెటర్లు కూడా ఆ డైలాగ్‌ను తెగ వాడేశారు. వికెట్‌ తీసినప్పుడల్లా జడేజా లాంటి వాళ్లు జూకేగా నహీ అంటూ ఆ డైలాగ్‌ను హిందీ వెర్షన్‌లో చెప్పారు. ఈ సినిమా దేశంలోని ఐదు భాషల్లో వచ్చినందున ఎక్కడికి తగ్గట్టు అక్కడ చెప్పుకుంటున్నారు. అచ్చంగా ఈ డైలాగ్‌ పశ్చిమ బంగలోని పదో పరీక్షల సమాధానపత్రాల్లో కనిపించింది. దీంతో పేపర్‌ దిద్దే టీచర్‌ షాకయ్యారు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఓ కుర్రాడు స‌మాధానాల‌కు బ‌దులు ఏకంగా ‘పుష్ప’ సినిమా డైలాగ్ రాసేశాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆ పరీక్షల్లో కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి పుష్ప డైలాగ్‌ను అనుకరిస్తూ ‘పుష్ప‌.. పుష్ప‌రాజ్‌.. అపున్ లిఖేంకే న‌హీ సాలా’’ అంటూ హిందీలో డైలాగ్ రాశాడు. ఈ పేపర్‌ను చూసిన ఉపాధ్యాయుడికి న‌వ్వాలో ఏడవాలో అర్థం కాని ప‌రిస్థితి ఎదురైంది.

ఆ పేపర్‌ ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో వైరల్‌గా మారాయి. మీరు పైన ఫొటోలో చూసింది ఆ పేపరే. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. సినిమాలు చూడ‌డం, ఎంజాయ్ చేయ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ ఇలా పైత్యం ముదిరిపోతే జీవితాలు నాశ‌నమవుతాయి. విద్యార్థులు ఈ విషయం గుర్తుంచుకోవడం చాలా మంచిది అని చెబుతున్నారు. చదువుకొని పరీక్షలు రాయకుండా ఇలా డైలాగ్‌లు రాయడం జోక్‌గా బాగుంటుంది కానీ, జీవితాలను ఇబ్బంది పెట్టేదే అని చెప్పొచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus