నందమూరి కొత్త వారసుడు.. దర్శనమిచ్చేది అప్పుడే..!

నందమూరి కుటుంబానికి దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి (Y. V. S. Chowdary) బంధం సుదీర్ఘమైనది. తారకరామారావు (Sr NTR) గారి స్పూర్తితో సినీ రంగంలో అడుగుపెట్టిన అతను, నందమూరి హరికృష్ణకు (Nandamuri Harikrishna) మంచి విజయాలు అందించారు. కమర్షియల్ గా ఈ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు. ఇప్పుడు హరికృష్ణ మనవడు, జానకీరామ్ (Janaki Ram Nandamuri) కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి మరోసారి నందమూరి కుటుంబం బాధ్యతలను తీసుకున్నాడు. ఈ కొత్త వారసుడి ప్రయాణం ఎలా ఉండబోతుందో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Nandamuri Fans

ఇప్పటివరకు ఈ కొత్త హీరోను మీడియా ముందుకు తీసుకురాకపోవడంతో అభిమానులు ఎగ్జైట్మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. అందుకే దీపావళి పండుగ టైమ్ లో అక్టోబర్ 30న ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ప్రత్యేక డేట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ లుక్‌ను నందమూరి అభిమానుల హృదయాల్ని ఆకట్టుకునేలా డిజైన్ చేయిస్తున్నారని వినికిడి. వైవిఎస్ చౌదరి సినిమా హీరోల లుక్ అంచనాలకు మించి ఉండటం సాధారణమే.

కానీ ఈసారి, ఈ కొత్త వారసుడిని ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఈ దర్శకుడు తనదైన శైలిలో ఫ్యామిలీ విలువలు, స్టైల్ కి ప్రాముఖ్యమిచ్చేలా చూపిస్తాడు. ఫస్ట్ లుక్ తరువాత, ఈ కొత్త హీరోను ఎలాంటి పాత్రలో పరిచయం చేస్తారనే క్లారిటీ రానుంది. వైవిఎస్ చౌదరి చాలా కాలం తర్వాత దర్శకుడిగా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కీరవాణి (M. M. Keeravani) , చంద్రబోస్ ( Chandrabose), సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) వంటి ప్రఖ్యాత టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో మార్పులు దృష్ట్యా, వై.వి.ఎస్ చౌదరి తనలోని పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ను కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అనంతరం షూటింగ్ ని జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయనున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 ‘బాలయ్య 109’ ఆ సమస్య ఇంకా తీరలేదట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus