NBK 109: ‘బాలయ్య 109’ ఆ సమస్య ఇంకా తీరలేదట..!

టైటిల్ చూడగానే ‘మైండ్లో వీడికి.. మైండ్ దొబ్బినట్టు ఉంది’ అని తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి లార్జర్ థెన్ లైఫ్ హీరో ఉంటే హీరో సమస్య అంటున్నాడు ఏంటి? అని మీరు అనుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) దర్శకుడు బాబీ కొల్లితో  (Bobby)  ఓ మాస్ అండ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. (NBK 109) షూటింగ్ చివరి దశలో ఉంది అంటూ టాక్ నడుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 కి రిలీజ్ అంటున్నారు.

NBK 109

మంచిదే ఫ్యాన్స్ కి ఈ మాత్రం అప్డేట్స్ చాలు పండుగ చేసుకోవడానికి..! కానీ ఇన్సైడ్ టాక్ పూర్తిగా వేరుగా ఉంది. ఎందుకంటే..? ఈ సినిమా (NBK 109) కథ ప్రకారం.. ఇంకో హీరో కావాలి. అందులోనూ మినిమమ్ ఇమేజ్ ఉన్న హీరో కావాలి. దాని కోసం ముందుగా నానిని సంప్రదించారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారితో నానికి గ్యాప్స్ ఉన్నాయనే టాక్ ఉంది కాబట్టి.. అతను లైట్ తీసుకున్నాడట. తర్వాత దుల్కర్ సల్మాన్ ని సంప్రదించారు.

కానీ అతను ఫుల్ ఫోకస్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) పై పెట్టడంతో .. అతన్ని నిర్మాతలు హోల్డ్ లో పెట్టారు. తర్వాత విశ్వక్ సేన్ ని (Vishwak Sen) అడిగారు. అతను వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. అతను కూడా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఇప్పటికీ ఆ యంగ్ హీరో పోర్షన్ కంప్లీట్ అవ్వలేదట. ఈ రోల్ కోసం 15 రోజులు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉందట. మరి ఫైనల్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి.

బిజినెస్ బాగానే జరిగింది కానీ.. పోటీలో నిలబడగలడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus