పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యమైతే ఈ సినిమా ఆ సమయానికి విడుదల కావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆగష్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. అయితే పవన్ నుంచి ఇందుకు సంబంధించి అనుమతి రావాల్సి ఉందని బోగట్టా. పవన్ అనుమతి ఇస్తే మాత్రం ఈ సినిమా అప్ డేట్ కు సంబంధించి అధికారికంగా వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కానున్నారు. జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు.
రాజకీయాల్లో బిజీ అయ్యేలోపు హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ తో పాటు వినోదాయ సిత్తమ్ రీమేక్ షూటింగ్ ను పవన్ కళ్యాణ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఆగష్టు 15వ తేదీన పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా హరిహర వీరమల్లు సక్సెస్ సాధిస్తే పవన్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?