ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో సలార్ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతుండగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కచ్చితంగా ఆ అంచనాలను మించి ఉండనుందని సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ ఛాప్టర్1 బ్లాక్ బస్టర్ హిట్టైనా నిర్మాతలకు ఈ సినిమాతో ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. అందువల్ల కేజీఎఫ్2 సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కింది. అయితే కేజీఎఫ్2 సినిమాతో కళ్లు చెదిరే లాభాలు రావడంతో నిర్మాతలు సలార్ సినిమా కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమాతోనే సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
వచ్చే ఏడాది ఆదిపురుష్, సలార్ సినిమాలతో పాటు ప్రభాస్, మారుతి కాంబో మూవీ కూడా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.