మహేష్ బాబు గత మూడు చిత్రాలైన ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. అయితే మహేష్ 27 వ చిత్రానికి మాత్రం తమన్ సంగీతం అందిస్తాడు అంటూ ప్రచారం జరిగింది. తమన్ కూడా కాస్త అత్యుత్సాహంతో తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించేసాడు. అయితే వంశీ పైడిపల్లి డైరెక్షన్ అయితే తమన్ నే తీసుకునే వారేమో.. ఇప్పుడు వంశీ-మహేష్ ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఇప్పుడు మహేష్ .. తన తరువాతి సినిమాని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో చేయనున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ’14 రీల్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి అని సమాచారం. కొరటాల శివ కూడా మరో నిర్మాతగా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇదిలా ఉంటే… ఇప్పుడు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునే అవకాశం లేదు. అతను వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ కూడా ‘ఉప్పెన’ మరియు ‘పుష్ప’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇలాంటి టైములో మహేష్ సినిమాకి ఎవరు మ్యూజిక్ అందిస్తారు అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఇలాంటి తరుణంలో గోపీ సుందర్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. దాదాపు ఇతన్ని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయట. అదే కానీ జరిగితే సంగీత దర్శకుడు గోపి సుందర్ కు ఇదే మొదటి పెద్ద సినిమా అవుతుంది. అయితే గతంలో మహేష్ బాబు .. ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమా పెద్ద ప్లాప్ అవ్వడం వల్ల తెలీలేదు కానీ.. ఆ చిత్రానికి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోరే ఇచ్చాడు గోపీ సుందర్.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!