Gopichand, Chiranjeevi: గోపీచంద్ – శ్రీను వైట్ల ప్రాజెక్ట్ వెనుక అంత కథ ఉందా?

గోపీచంద్ కి ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. గత ఏడాది వచ్చిన ‘పక్కా కమర్షియల్’ ప్లాప్ అయ్యింది. ఈ ఏడాది వచ్చిన ‘రామ బాణం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ‘భీమ’ అనే సినిమా చేస్తున్నాడు. కన్నడ దర్శకుడు హర్ష.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై పెద్దగా అంచనాలు అయితే లేవు. టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ అయితే.. ఒకవేళ అంచనాలు పెరగొచ్చేమో. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు గోపీచంద్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టాడు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ‘చిత్రాలయం స్టూడియోస్’ బ్యానర్ పై వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపీచంద్ కి ఇది 32 వ సినిమా కావడం విశేషం. అయితే ఈ ప్రాజెక్టు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. వాస్తవానికి శ్రీను వైట్ల.. చిరంజీవితో చేయాలనుకున్న కథ ఇదట. కానీ శ్రీనువైట్ల ఫామ్లో లేకపోవడం వల్ల చిరు వెంటనే ఓకే చెప్పలేదట.

కానీ శ్రీనువైట్లకి ఛాన్స్ ఇవ్వాలని భావించి ఆయన మరో రీమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని.. బాధ్యతలు అప్పగించగా.. శ్రీను వైట్ల తన స్టైల్లో ఆ స్క్రిప్ట్ ను డెవలప్ చేయడం జరిగింది. కానీ ‘ఆచార్య’ ‘భోళా శంకర్’ ఫలితాలతో చిరు ఇప్పుడు రిస్క్ చేసే ఆలోచనలో లేరు. అందుకే శ్రీనువైట్ల స్క్రిప్ట్ ను లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇక చిరుకి మొదట వినిపించిన కథనే.. ఇప్పుడు గోపీచంద్ తో (Gopichand) చేయడానికి శ్రీను వైట్ల రెడీ అయ్యాడట. ఈ ఇద్దరికీ కూడా సక్సెస్ చాలా అవసరం. మరి ఏమవుతుందో చూడాలి..!

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus