Gopichand, Balakrishna: బాలయ్య గోపీచంద్ మూవీ నుంచి సూపర్ డైలాగ్ లీక్!

సాధారణంగా బాలయ్య సినిమాలో డైలాగులు బాగుంటాయని ప్రేక్షకుల్లో చాలామంది అభిప్రాయపడతారు. తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను మెప్పించే బాలయ్య అఖండతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా విడుదలై 30 రోజులైనా సినిమాకు కలెక్షన్లు మాత్రం వస్తున్నాయి. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుందనే సంగతి తెలిసిందే. బాలయ్య కోసం గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

అయితే ఈ సినిమా డైలాగ్ అంటూ ఒక డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. “రేయ్ రోడ్డు మీదకు జింక వచ్చిందనుకో ఎవరైనా హారన్ కొడతాడు అదే సింహం వచ్చిందంటే ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్ గా కూర్చుంటాడు అక్కడ ఉన్నది సింహం రా రేయ్” అనే డైలాగ్ బాలయ్య గోపీచంద్ మూవీ డైలాగ్ అని సమాచారం. సినిమాలో బాలయ్యను పరిచయం చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్ ఈ డైలాగ్ అని తెలుస్తోంది. ఈ డైలాగ్ అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

క్రాక్ సక్సెస్ తర్వాత బాలయ్యతో తెరకెక్కిస్తున్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని గోపీచంద్ మలినేని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. బాలయ్య శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు కూడా బాగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి ఉండగా మరో హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు రిలీజయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా. బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో బాలయ్య నటిస్తుండటం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus