Gopichand Malineni: వీరసింహారెడ్డి కామెంట్లపై గోపీచంద్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో రీసెర్చ్ చేసి గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని వీరసింహారెడ్డి మూవీలో కూడా ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.

వీరసింహారెడ్డి మూవీలో ఉన్న సిస్టర్ సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని గోపీచంద్ మలినేని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరసింహారెడ్డిలో ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకులు ఇరగదీశారని కామెంట్ చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే సెకండాఫ్ లో ఎమోషన్స్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యాయని గోపీచంద్ మలినేని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ విషయంలో మా కాన్ఫిడెన్స్ నిజమైందని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఫస్టాఫ్ ను ఫ్యాన్ బాయ్ గా తీశానని సెకండాఫ్ ను మాత్రం దర్శకునిగా తీశానని గోపీచంద్ మలినేని వెల్లడించారు. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా డిజైన్ చేశారని గోపీచంద్ మలినేని వెల్లడించడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆ కెరీర్ లోనే మంచి నిర్మాతలు అని వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉంటానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.

గోపీచంద్ మలినేని రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గోపీచంద్ మలినేని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. వీరసింహారెడ్డి రిజల్ట్ నేపథ్యంలో గోపీచంద్ మలినేని ఛాన్స్ ఇచ్చేది ఎవరో స్పష్టత రావాల్సి ఉంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus