సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) హిందీలో డెబ్యూ ఇస్తూ చేసిన సినిమా ‘జాట్’ (Jaat) . ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఈ కలెక్షన్స్ తో దర్శకుడు సంతృప్తిగా లేనట్టు తెలిపి షాకిచ్చాడు గోపీచంద్ మలినేని. ‘జాట్’ ఓపెనింగ్స్ పై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… “సెన్సార్ పనులు అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు.
దాని వాళ్ళ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా త్వరగా ఓపెన్ చేయలేదు. రిలీజ్ కి కేవలం ఒక రోజు ముందు రిలీజ్ అయ్యాయి. అవి కనీసం 2,3 రోజులు ముందు ఓపెన్ అయ్యి ఉంటే.. ఓపెనింగ్స్ కచ్చితంగా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి.. కొంచెం గ్రోత్ కూడా చూపిస్తున్నాయి.. కానీ మేము ఆశించిన ఓపెనింగ్స్ అయితే రాలేదు.
అది మమ్మల్ని కొంత డిజప్పాయింట్ చేసిన అంశం” అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క ‘జాట్’ కాంట్రోవర్సీపై కూడా గోపీచంద్ మలినేని స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ” చర్చ్ సీన్ వివాదాస్పదమైంది. యేసు క్రీస్తుని వక్రీకరించినట్టు ఉందని కొంతమంది అభ్యంతరం తెలిపారు. అయితే సెన్సార్ టైంలో ఈ విషయంపై అధికారులు అభ్యంతరం తెలుపలేదు.
ఒకవేళ చెప్పి ఉంటే.. కచ్చితంగా మేము ఆ సన్నివేశాన్ని తొలగించేవాళ్ళం. కానీ రిలీజ్ అయ్యి, సినిమా బ్లాక్ బస్టర్ అయిన టైంలో ఇలాంటివి వస్తే మేము ఏం చేస్తాం. ఏ ఫిలిం మేకర్ అయినా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తాడు కానీ కులాల పై, మాటలపై విమర్శలు చేసి నొప్పించాలని అనుకోడు కదా?” అంటూ వివరణ ఇచ్చాడు గోపీచంద్ మలినేని.