Veera Simha Reddy: ఇది శాంపిల్ మాత్రమేనంటూ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్..

‘అఖండ’ బ్లాక్ బస్టర్ తో మాంచి ఊపు మీదున్న బాలయ్య, ‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ కి ‘వీర సింహా రెడ్డి’ అనే పవర్ ఫుల్ టైటిల్స్ ఫిక్స్ చేశారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్’’ అనే సాలిడ్ ట్యాగ్ లైన్ కూడా పెట్టి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు మేకర్స్. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ బాలయ్య ఫ్యాన్స్, కర్నూలు ప్రజలు, మూవీ యూనిట్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది..

టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ చూసిన అభిమానుల ఆనందానకి అవధుల్లేకుండా పోయాయి. పైగా సినిమా సంక్రాంతికి రిలీజ్ అని చెప్పి వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేశారు టీం. స్వతహా బాలయ్య బాబు ఫ్యాన్ అయిన డైరెక్టర్ గోపిచంద్ అయితే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ అభిమానుల దృష్టిలో అంచనాలు ఆకాశాన్నంటే రేంజ్ లో పెంచేశాడు. ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు సినిమాలోని డైలాగ్ ఒకటి చెెప్పాడు గోపిచంద్..‘‘సమరసింహా రెడ్డి’ రిలీజ్ రోజంతా జైల్లో ఉన్న ఒక బాలయ్య ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో..

అదే ఈ ‘వీర సింహా రెడ్డి’.. ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకునేలా ఉంటుందీ సినిమా.. ‘సమరసింహా రెడ్డి’ ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో.. ఈ ‘వీర సింహా రెడ్డి’ మళ్లీ అలాంటి వైబ్రేషన్ ఇస్తుంది. సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ విజృంభించబోతున్నాడు.. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాసరే.. ఇప్పటికిప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా బ్లాక్ బస్టరే..

అంత స్టఫ్ ఉందీ సినిమాలో.. ‘వీర సింహా రెడ్డి’.. పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్’’.. అంటూ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అభిమానుల్ని అలరించాడు దర్శకుడు గోపిచంద్ మలినేని.. 2023 సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus