Gopichand, Puri Jagannadh: యాక్షన్‌ హీరోతో సినిమాకు పూరి రెడీ.. ప్రాజెక్ట్‌ ఓకే అయిందా?

నీకూ హిట్టు లేదు.. నాకూ హిట్టు లేదు.. ఇద్దరం కలసి సినిమా చేద్దామా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుంది అని అంటున్నారు. గతంలో ఆ ఇద్దరూ కలసి ఓ సినిమా చేసినా.. అది అనుకున్నంత పెద్ద విజయం అందుకోలేదు. ఆ కాంబినేషనే పూరి జగన్నాథ్‌ – గోపీచంద్‌. గతంలో గోపీచంద్‌  (Gopichand ) – పూరి జగన్నాథ్‌   (Puri Jagannadh) కలసి ‘గోలీమార్‌’ (Golimaar) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

Gopichand, Puri Jagannadh

ఇప్పుడు వాళ్లిద్దరూ కలసి ఓ సినిమా చేసే ఆలోచనలో డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ‘గోలీమార్‌’కి సీక్వెల్‌ అని అంటున్నారు. తొలి సినిమా క్లైమాక్స్‌లోనే రెండో పార్టుకు లీడ్‌ ఇచ్చారు పూరి జగన్నాథ్‌. అయతే ఇన్నాళ్లూ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. అటు గోపీచంద్‌కు (Gopichand) , ఇటు పూరి జగన్నాథ్‌ గత కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. మొన్నీమధ్యే రామ్‌తో (Ram) ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart)  సినిమా చేసి బొక్కబోర్లా పడ్డారు.

దీంతో ఇప్పుడు పూరి నెక్స్ట్‌ మూవీ ఎవరితో అనే చర్చ జరుగుతోంది. మరోవైపు గోపీచంద్‌ ఈ ఏడాది మార్చిలో ‘భీమా’ (Bhimaa) సినిమాతో వచ్చాడు. అది బాక్సాఫీసు దగ్గర తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘విశ్వం’ (Viswam)  సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా ఫలితం బాగుంటే గోపీచంద్‌ (Gopichand) నెక్స్ట్‌ మూవీ నిర్ణయంలో మార్పు ఉండొచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది. శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా మీద అంతగా అంచనాలు అయితే లేవు.

కానీ ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కాస్త ఆసక్తికరంగా కనిపించింది. పాత శ్రీను వైట్ల మళ్లీ వచ్చారా అనేంతలా వినోదం పండించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 11న విడుదలవుతుందని టాక్‌. ఆ రోజు వచ్చే ఫలితం బట్టి పూరి జగన్నాథ్‌ నెక్స్ట్‌ సినిమా ఏదని తేలుతుంది.

బెల్లంకొండ సరసన స్టార్‌ దర్శకుడి కుమార్తె.. ఇక్కడా రాణిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus