నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో ఎక్కువ శాతం కొత్తవాళ్ళే నటించారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయితే ‘జయం’ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి గోపీచంద్ విలనిజం కూడా ప్రధాన కారణం అని చెప్పాలి. సుజాత(హీరోయిన్ సదా) బావ రఘు పాత్రని గోపీచంద్ పోషించాడు. ఈ పాత్ర చాలా కృయాలిటీతో కూడుకొని ఉంటుంది.
పెద్దలంటే రెస్పెక్ట్ ఉండదు, స్త్రీలంటే ఆ ఒక్క పనికే అన్నట్టు ఈ పాత్ర తీరు ఉంటుంది. చెప్పాలంటే చాలా కల్ట్ రోల్ ఇది..! అయితే మొదట ఈ పాత్ర కోసం గోపీచంద్ ను అనుకోలేదట. ‘జయం’ సినిమాలో విలన్ పాత్ర కోసం మొదట ఓ బాలీవుడ్ నటుణ్ని ఎంపిక చేసుకున్నారు తేజ. అతనితో రెండు, మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు. కానీ తేజ సంగతి తెలిసిందే కథ. తనకు నచ్చింది దొరక్కపోతే అస్సలు సంతృప్తి చెందడు. అదే విధంగా ఆ బాలీవుడ్ నటుడి యాక్టింగ్ కూడా తేజకి నచ్చలేదు.
దాంతో ఓ రెండు, మూడు రోజులు షూటింగ్ జరిపి ఆపేసాడు. తర్వాత ఆ బాలీవుడ్ నటుడిని సినిమా నుండీ తప్పించాడు. ఈ క్రమంలో మళ్ళీ విలన్ కోసం గాలిస్తున్న సందర్భంలో.. అతని సన్నిహితులు గోపీచంద్ గురించి తెలియజేశారు. దాంతో అతన్ని పిలిపించి.. లుక్ టెస్ట్ చేసి, బాడీ లాంగ్వేజ్ చూసి ఫైనల్ చేసాడట తేజ. ఆ తర్వాతి రోజు నుండే షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. ‘జయం’.. గోపీచంద్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.