తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి గోపీచంద్ హీరోగా పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో విలన్ పాత్రలకు గోపీచంద్ ఓకే చెప్పారు. గోపీచంద్ విలన్ గా నటించిన పలు సినిమాలు సక్సెస్ సాధించగా యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా మారారు. యజ్ఞం మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నటుడిగా గోపీచంద్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా గురించి అలీతో సరదాగా షోలో గోపీచంద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యజ్ఞం సినిమాకు నన్ను ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా జరిగిందని గోపీచంద్ తెలిపారు. మొదట యజ్ఞం మూవీ కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందని ఆ సినిమా దర్శకుడు కొత్త దర్శకుడు కావడంతో ప్రభాస్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారని గోపీచంద్ అన్నారు. ఆ తర్వాత యజ్ఞం కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లిందని గోపీచంద్ తెలిపారు. అయితే కొత్త దర్శకుడు కావడంతో కళ్యాణ్ రామ్ కూడా ఆ సినిమా కథను రిజెక్ట్ చేశారని గోపీచంద్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత బాబాయ్ పోకూరి బాబూరావు యజ్ఞం మూవీలో హీరోగా నటిస్తావా అని నన్ను అడిగారని ఆయన తెలిపారు. నేను వెంటనే ఒప్పుకున్నానని గోపీచంద్ చెప్పుకొచ్చారు. యజ్ఞం సినిమాలో హీరోగా ఎంపికయ్యే సమయానికి నేను వర్షం, నిజం షూటింగ్ లలో పాల్గొంటున్నానని గోపీచంద్ పేర్కొన్నారు. ఒక్కడు మూవీలో ఓబుల్ రెడ్డి రోల్ కోసం ప్రకాష్ రాజ్ ను సంప్రదించారని ఆయన డేట్స్ కేటాయించకపోవడంతో డైరెక్టర్ గుణశేఖర్ నాకు ఓబుల్ రెడ్డి పాత్ర గురించి చెప్పారని గోపీచంద్ చెప్పుకొచ్చారు.
ఒక్కడు సినిమాలో చేస్తానని నేను చెప్పానని అయితే ప్రకాష్ రాజ్ డేట్లు సర్దుబాటు చేయడంతో ఆ సినిమాలో అవకాశాన్ని కోల్పోయానని ఆయన తెలిపారు. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!