Gopichand: ఆ సెంటిమెంట్ గోపీచంద్ నమ్మకాన్ని నిజం చేస్తుందా?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయడానికి కారణమేంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ నేపథ్యంలో గోపీచంద్ కచ్చితంగా తర్వాత ప్రాజెక్ట్ తో సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉందనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల నేపథ్యంలో గోపీచంద్ తనకు ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్ ను నమ్ముకున్నారు.

మాచో స్టార్ గోపీచంద్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాల టైటిల్స్ సున్నాతో ఎండ్ అయ్యాయి. ఈ విధంగా సున్నాతో ఎండ్ అయిన టైటిల్స్ తో ఉన్న సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడంతో గోపీచంద్ ఈ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని సినిమాలకు ఈ సెంటిమెంట్ ఫాలో అయినప్పటికీ ఆ సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఫ్యాన్స్ ను మరింత బాధ పెట్టాయి.

అన్ స్టాపబుల్ షో ద్వారా గోపీచంద్ ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. గోపీచంద్ కు జోడీగా ఈ సినిమాలో డింపుల్ హయాతి నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఖిలాడీ మూవీతో డింపుల్ హయాతి ఖాతాలో ఫ్లాప్ చేరగా రామబాణం సినిమాతో డింపుల్ హయాతి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

ఖుష్బూ, జగపతి బాబు రామబాణం సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ షోలో గోపీచంద్ మరిన్ని కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. గోపీచంద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus