టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. బింబిసార సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ లేదనే సంగతి తెలిసిందే. సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న తొలి మూవీ ఇదే కావడం గమనార్హం.
కరోనా వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే సినిమాలకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ కే ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కళ్యాణ్ రామ్ కత్తి మీద సాము చేస్తున్నారనే చెప్పాలి. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. పటాస్ తర్వాత ఆ సినిమా స్థాయి సక్సెస్ లేని కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది