కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండడం శుభ పరిణామం అని అంతా భావిస్తున్నారు..! అయితే ఇది కంట్రోల్ అవ్వడానికి ముఖ్య కారణం లాక్ డౌన్ వల్లే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..! దేశవ్యాప్తంగా 4 లక్షల వరకు కేసులు పెరిగిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేయడం.. ఆ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టాయి.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. 5శాతం కంటే పాజిటివిటీ రేటు కంటే తక్కువగా ఉన్న ప్రదేశాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తుంది.
అంతేకాదు అక్కడ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్ల రన్ చేసుకోవచ్చు అంటూ అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా థియేటర్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఓపెన్ అవ్వడం ఇప్పట్లో కష్టమే అనే టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు. థియేటర్లు ఓపెన్ చేస్తే..
కొత్త సినిమాలు విడుదల చేస్తే రద్దీ ఏర్పడడం ఖాయం అని వారు భావిస్తున్నారు. అయితే ఈ నెలాఖరు నుండీ షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలకు ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే అది కూడా తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ తోనే షూటింగ్ లు జరపాలనే నిబంధనతో వాటికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందట.ఏదేమైనా థియేటర్స్ ఓపెనింగ్స్ కోసం అయితే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని స్పష్టమవుతుంది.