యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) రూపొందింది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , కాజల్ (Kajal Aggarwal) , సిద్దార్థ్ (Siddharth) , బాబీ సింహా (Bobby Simha), ఎస్.జె.సూర్య (S. J. Suryah) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
అనిరుధ్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. జూలై 12న అంటే మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తమిళ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ టీం టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకోవడం గమనార్హం. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సింగల్ స్క్రీన్స్ కి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 పెంచుకునే అవకాశం కల్పించింది.
మొదటి వారం అంతా ఇవే రేట్లు అమల్లో ఉంటాయట. అప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో రూ.225 , మల్టీప్లెక్సుల్లో రూ.350 గా ఉంటున్నాయి ‘భారతీయుడు 2 ‘ టికెట్ రేట్లు. జీఎస్టీలు వంటి వాటితో కలుపుకుంటే ఆ రేట్లు ఇంకా పెరుగుతాయి. దీంతో ‘ఓ డబ్బింగ్ సినిమాకి ఇంతంత టికెట్ రేట్లు అవసరమా’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.