Naga Chaitanya: నాగచైతన్య షూటింగ్‌ ఆపేసిన ప్రభుత్వం!

సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చాక.. రద్దు చేయడం చాలా తక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా పెద్దగా జరిగింది లేదు. పక్కాగా అన్ని అనుమతులు తీసుకొని షూటింగ్స్‌ చేస్తున్నారు. ఓ యువ స్టార్‌ హీరో సినిమా షూటింగ్‌ ఒకటి క్యాన్సిల్‌ అయ్యింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా షూటింగే ఇటీవల ఆగిపోయింది. నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న కొత్త సినిమా విషయంలోనే ఇది జరిగింది.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా పాలనా యంత్రాంగం రద్దు చేసింది. మేలుకోట సమీపంలో చిత్ర బృందం రాజగోపురం తరహాలో ఓ సెట్‌ వేసి.. అక్కడ మద్యం విక్రయకేంద్రం పెట్టిందట. అంతేకాదు అందులో వివిధ బ్రాండ్ల మద్యం సీసాలను ఉంచి షూటింగ్‌ ప్రారంభించారట. ఈ మొత్తం వ్యవహారం చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్‌ విషయంలో సీరియస్‌ అయ్యారు కూడా.

సినిమా షూటింగ్‌ కోసం ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందట. అయితే ఆ నిబంధనలను సినిమా యూనిట్‌ టీమ్‌ ఉల్లంఘించారట. ఈ నేపథ్యంలో స్థానిక కన్నడ సంఘాల ప్రతినిధులు చిత్రబృందంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మౌఖిక ఫిర్యాదు చేశారట. విషయాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో షూటింగ్‌ నిలిపేయాల్సిందిగా చిత్రబృందాన్ని పాలనా యంత్రాంగం ఆదేశించింది.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య – కృతి శెట్టి జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే చిత్రబృందాన్ని తమదైన శైలిలో వెంకట్‌ ప్రభు పోస్టర్లతో అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా పోలీసు కథ అని.. ఆ పోస్టర్లు చూస్తే తెలిసిపోతుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ను ఇటీవల స్టార్ట్‌ చేశారు. అయితే ఇప్పుడు అభ్యంతరాల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. ఆ సన్నివేశాలను వేరే దగ్గర చిత్రీకరిస్తారో, లేక సెట్స్‌ వేసి తీస్తారో తెలియాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus