కరోనా లాక్ డౌన్లో కంటే కూడా ఎక్కువగా ఈ ఏడాది సినీ ప్రముఖులు మరణించారు అని చెప్పాలి. టాలీవుడ్ లోనే కాకూండా మిగిలిన భాషల్లోని సినీ సెలబ్రిటీలు కూడా ఈ ఏడాది అనేక కారణాల వల్ల మరణించారు. అయితే ఎక్కువ దెబ్బ మాత్రం టాలీవుడ్ కే పడింది అని చెప్పాలి. ముఖ్యంగా 2022 ఎండింగ్ లో కృష్ణంరాజు, కృష్ణ.. ఇప్పుడు కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను టాలీవుడ్ కోల్పోయింది. వీళ్ళు ఇప్పటికీ.. నటిస్తుంది, రాణిస్తుంది, అలరిస్తుంది అంటూ ఏమీ లేదు.
కానీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉంటూ వచ్చారు. ఇండస్ట్రీ పెద్దలు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో వీరిని కలుసుకుని సలహాలు సూచనలు తీసుకునేవారు. కృష్ణంరాజు గారు ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించారు. తర్వాత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని పెద్ద దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలను కల్పించుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఇక కృష్ణ గారు చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చినా..!
టాలీవుడ్ ను కొత్త బాటలో నడిపించి సక్సెస్ అయ్యారు. అలా ఆయన కూడా స్టార్ గా ఎదిగారు. ఇక కైకాల సత్యనారాయణ గారు హీరో కాకపోయినా విలక్షణ నటుడిగానే అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే వారు.బహుశా ఈ విషయం ఎవ్వరికీ తెలియదనుకుంట.!ఈయన షూటింగ్ కు వచ్చే వరకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఆ రోజుల్లో ఈయన కాల్ షీట్లు దొరకడం అంత కష్టంగా ఉండేది.
‘అడవి రాముడు'(1977) ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.ఈ ముగ్గురు కూడా వయసు సంబంధిత సమస్యల వల్లే మరణించారు. ఇలా ఈ ఏడాది చివర్లో ఇలాంటి గొప్ప నటులను కోల్పోవడం అనేది టాలీవుడ్ కు తీరని లోటుగా భావించాలి.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?