Gully Rowdy Movie: ‘గల్లీ రౌడీ’ వాయిదా పడక తప్పదా..?

ఎలాంటి కాంపిటీషన్ లేకుండా సోలోగా తన సినిమాను విడుదల చేసుకొని మంచి కలెక్షన్స్ రాబట్టాలని సందీప్ కిషన్ ఎప్పుడూ ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఆయన అనుకున్న డేట్ కి ఏదొక సినిమా వస్తూనే ఉంటుంది. దీంతో తన సినిమాల రిలీజ్ డేట్స్ ను మార్చుకుంటూ ఉంటాడు సందీప్ కిషన్. ఇప్పుడు ఆయన నటించిన ‘గల్లీ రౌడీ’ అనే కొత్త సినిమా విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘గల్లీ రౌడీ’ సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ వలన అది సాధ్యం కాలేదు. ఆ తరువాత ఓటీటీలో నేరుగా సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈలోపు థియేటర్లు తెరుచుకున్నాయి. దాంతో సెప్టెంబర్ 3న తమ సినిమా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు. దానికి తగ్గట్లే పబ్లిసిటీ ప్లాన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 3న గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలవుతుంది. సెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కూడా ఉంది.

దీంతో ‘గల్లీ రౌడీ’కి సోలోగా రావడం కుదరడం లేదు. ఇప్పుడు మరో కొత్త డేట్ ను చూసుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించారు. నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus