తెలుగు చిత్రసీమలో “చిత్రరాజాలు” అని పేర్కొనదగ్గ అతికొద్ది చిత్రాల్లో మొదటివరుసలో చేర్చదగిన చిత్రం “గుండమ్మ కథ”. ఎన్టీయార్, ఏయన్నార్ ల నట విశ్వరూపం, గయ్యాళి అత్తగా సూర్యకాంతం నిండైన రూపం కలగలిసి “గుండమ్మ కథ” చిత్రాన్ని ఓ క్లాసిక్ హిట్ గా నిలబెట్టాయి.
ఆ సినిమాను జూనియర్ ఎన్టీయార్ మరియు నాగచైతన్యలతో రీమేక్ చేయాలన్నది స్వర్గీయ నిర్మాత రామానాయుడు చిరకాల కోరిక. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మంచు విష్ణు మరియు రాజ్ తరుణ్ లతో రీమేక్ చేయాలనుందని పేర్కొని మోహన్ బాబు మరోమారు అబాసుపాలయ్యారు. డైలాగ్ డెలివరీలో ఇప్పటికీ కనీసం “అ ఆ”లు సైతం నేర్చుకోని విష్ణు ఏంటి.. ఎన్టీయార్ పాత్రను పోషించడం ఏంటి? అలాగే.. అన్ని సినిమాల్లోనూ రవితేజను కాపీ కొడుతూ కెరీర్ ను నెట్టుకొస్తున్న రాజ్ తరుణ్ చేత నాగేశ్వరరావు పాత్రను పోషింపజేయడం ఏంటని? “గుండమ్మ కథ” సినిమాపై అభిమానం మెండుగా ఉన్న సినిమా అభిమానులందరూ మోహన్ బాబుపై కోపోద్రిక్తులవుతున్నారు!