Guns and Gulaabs Review in Telugu: గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దుల్కర్ సల్మాన్, రాజ్ కుమార్ రావ్, గుల్షన్ దేవయ్య (Hero)
  • టీజే భాను, పూజా గోర్, శ్రేయ ధన్వంతరి (Heroine)
  • గౌత‌మ్ శ‌ర్మ‌, ఆదర్శ్ గౌరవ్ , సతీష్ కౌశిక్ తదితరులు (Cast)
  • రాజ్‌ అండ్ డీకే (Director)
  • రాజ్ అండ్ డీకే (Producer)
  • అమన్ పంత్ (Music)
  • పంకజ్ కుమార్ (Cinematography)
  • Release Date : ఆగస్టు 18, 2023

ఈ వారం చాలా వరకు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటో రెండో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మిగిలిన సినిమాలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి అనుకోవాలి అంతే. అయితే ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఎందుకంటే ‘ఫ్యామిలీ మెన్’ ‘ఫర్జీ’ వంటి సిరీస్ లు రూపొందిన రాజ్ అండ్ కె దీనికి దర్శకులు కాబట్టి..! మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేర ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం రండి :

కథ : ‘గులాబ్ గంజ్’ అనే ప్రాంతంలో సాగే కథ ఇది. టిప్పు ( రాజ్ కుమార్ రావు) ఓ బైక్ మెకానిక్. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు.అతనొక స్మగ్లర్. ఊహించని విధంగా టిప్పు కూడా రెండు మర్డర్లు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను టిప్పు కూడా తన తండ్రిలానే చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడేమో అని భయపడి ఆ ఊరి నుండీ పారిపోతాడు. మరోపక్క అర్జున్ వర్మ (దుల్కర్ సల్మాన్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనికి గులాబ్ గంజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్రమంలో అతను నల్ల మందు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలో అక్రమ రవాణా చేసే గాంచి (సతీష్ కౌశిక్) అతని లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక గాంచి కొడుకు జుగ్ను (ఆదర్శ్ గౌరవ్) తన అక్రమ రవాణాకు వారసుడిగా నిలబెట్టాలి అని భావిస్తాడు. అటు తర్వాత గాంచి నల్లమందు అక్రమ రవాణా విషయంలో ఓ పెద్ద డీల్ కుదుర్చుకుంటాడు. అదే టైంలో అతను ప్రమాదంలో చిక్కుకుని హాస్పిటల్ పాలవుతాడు. దీంతో నల్లమందు అక్రమ రవాణా చేయాల్సిన డీల్ జుగ్ను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది? ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ వర్మ , గాంచి , జుగ్ను, టిప్పు ల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ?

నటీనటుల పనితీరు : టిప్పు రాజ్ కుమార్ రావ్ నేచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని నటన, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. దుల్కర్ సల్మాన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వంద శాతం అతను హానెస్ట్ పెర్ఫార్మర్. ఇందులో కూడా అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా చక్కగా నటించి ఆ పాత్రకి జీవం పోశాడు. గుల్షన్ దేవయ్య కి వైవిధ్యమైన రోల్ దొరికింది.

దానికి అతను బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. జుగ్ను పాత్రలో ఆదర్శ్ గౌరవ్ కూడా మెప్పించాడు. గౌత‌మ్ శ‌ర్మ‌, టి.జె.భాను, సతీష్ కౌశిక్ వంటి మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పొచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకులు రాజ్ అండ్ డీకే ఎంతో శ్రద్ధ పెట్టి చేసిన మరో సిరీస్ ఇది. కథ 90ల నాటిది. ఆ వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించారు. టైటిల్ నుండి వీరు తీసుకున్న జాగ్రత్తల గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం.క్యాసెట్లో పాటలు వినడం,ఫ్లేమ్స్ ఆడటం వంటివి కూడా ఇందులో చూపించారు. కథ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. అయినా మనం స్క్రీన్ పై చూస్తున్నప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ కి గురవ్వడం వంటివి ఉండవు.

దర్శకుల టేకింగ్ అలా ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా బలమైన సన్నివేశాలు లేకపోవడం ఒక మైనస్ కాగా డ్రాగింగ్ పోర్షన్స్ ఎక్కువగా ఉండటం ఇంకో మైనస్ అని చెప్పాలి. ఫ్యామిలీ మెన్, ఫర్జీ రేంజ్ లో అయితే గన్స్ అండ్ గులాబ్స్ ఉండదు. కానీ ఒకసారి కచ్చితంగా చూసే విధంగానే ఉంటుంది. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే..! ప్రొడక్షన్ వర్క్ కూడా కథకు తగ్గట్టు బాగానే అనిపిస్తుంది.

విశ్లేషణ : ఫ్యామిలీ మెన్, ఫర్జీ రేంజ్ లో అయితే ‘గన్స్ అండ్ గులాబ్స్’ అలరించదు. కాబట్టి తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే బెటర్. నెట్ ఫ్లిక్స్ లో 7 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉంది. ఈ ఫస్ట్ సీజన్ ని ఓపిక ఉంటే ఒకసారి చూసేయండి.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

Click Here To Read in HINDI 

Watch Here

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus