Guntur Kaaram: లీక్డ్ వీడియోతో మహేష్ అభిమానుల్లో జోష్ బాగా పెరిగిపోయిందిగా..!

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘గుంటూరు కారం’. ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ఇది. అనౌన్స్మెంట్ నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది.

ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఈ మధ్యనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. దీనికి మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించినా.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. మరోపక్క సెకండ్ సింగిల్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాను అని నాగవంశీ తెలిపారు. ఆ పాటకు సంబంధించిన చిత్రీకరణ కూడా జరుగుతుంది. అయితే ఆ పాటకు సంబంధించిన చిన్న వీడియో బిట్ లీక్ అయ్యింది. అది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిత్ర బృందం అలర్ట్ అయ్యి..

అవి పోస్ట్ చేసిన వారి అకౌంట్లు బ్లాక్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ వీడియోలో మహేష్ డాన్స్ మూమెంట్ హైలెట్ అయ్యింది అని చెప్పాలి. సెకండ్ సింగిల్ అదే రెండో లిరికల్ సాంగ్లో ఇలాంటి డాన్స్ మూమెంట్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ సినిమా 2024 జనవరి 12 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

VJ Sunny, Hrithika Srinivas, Sivannarayana and Sound Party Team Exclusive Interview | Filmy Focus

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus