‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ తోనే భీభత్సమైన హైప్ ఏర్పడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠత పెరిగిపోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. అర్ధరాత్రి 1 గంట నుండి షోలు పడుతున్నాయి. టికెట్ రేట్లు రూ.3 వేల నుండి రూ.5 వేల వరకు రేటు పలుకుతున్నా అభిమానులు తగ్గడం లేదు.
ఇక సోషల్ మీడియాలో అయితే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) గురించి రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ గురించి ఏవేవో కథనాలు వినిపిస్తున్నాయి..అలాగే షూటింగ్ స్పాట్ నుండి తీసిన ఫోటోలు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో ‘జన దేశం పార్టీ’ అంటూ ఒకరిద్దరు పొలిటీషియన్స్ కనిపించారు. ఈ సన్నివేశాలు టీడీపీ,జనసేన పార్టీలను ఉద్దేశించి దర్శకుడు త్రివిక్రమ్ పెట్టాడు అంటూ కథనాలు మొదలయ్యాయి.
ఎందుకంటే జె.ఎస్.పి పార్టీ, టీడీపీ పార్టీని(JSP + TDP = JDP ) స్ఫూర్తిగా తీసుకుని జె.డి.పి గా తయారుచేసి సినిమాలో వాడుకున్నారు అని అంతా భావిస్తున్నారు. ఇంకొందరైతే మహేష్ బాబు కూడా టీడీపీ,జనసేన పార్టీల పొత్తుకి ఏకీభవిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.త్రివిక్రమ్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కి మంచి మిత్రుడు అందుకే ఆ పాయింట్ తీసుకున్నాడు అని కూడా అంతా అనుకుంటున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!