మహేష్ బాబు, శ్రీలీల ప్రధాన పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికయ్యారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ లో సైతం స్వల్పంగా మార్పులు జరుగుతున్నాయని త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది. మరోవైపు గుంటూరు కారం సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ సినిమా హక్కులను 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా (Guntur Kaaram) హక్కులు ఈ రేంజ్ లో పలికాయి. త్రివిక్రమ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో దిల్ రాజు ఈ స్థాయిలో రిస్క్ చేసినట్టు సమాచారం. నైజాంలో కీలక థియేటర్లు అన్నీ దిల్ రాజు చేతిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మహేష్ బాబు గత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు నిలవడంతో మహేష్ సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే మొదలుకానుందని తెలుస్తోంది. మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా బిజినెస్, ఇతర లెక్కల ఆధారంగా మహేష్ పారితోషికం తీసుకుంటున్నారు. మహేష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు మహేష్ కు క్రేజ్ పెరుగుతోంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!