Guntur Kaaram: గుంటూరు కారం ప్రీ రిలీజ్ డేట్ టైం పిక్స్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మూడోసారి నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం జనవరి ఏడవ తేది హైదరాబాదులో యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని మేకర్స్ భావించారు.

అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే తాజాగా మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేకర్స్ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈసారి ఈవెంట్ తెలంగాణలో కాకుండా ఏపీలో నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఈసారి గుంటూరులోనే నిర్వహించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

గుంటూరులో నంబూరు క్రాస్ రోడ్స్ కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేయబోతున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

బహుశా ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా రాజమౌళి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో వీరిద్దరూ పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి శ్రీ లీలా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus