ఒక సినిమాకు ఇన్‌స్టంట్ హైప్ రావాలి అంటే అది కచ్చితంగా స్టార్ కాంబినేషన్ అయి ఉండాలి. స్టార్ హీరో సినిమాకు వచ్చే హైప్‌కి బజ్ తోడవ్వాలంటే స్టార్ డైరక్టర్ ఆ సినిమాను డైరెక్ట్ చేయాలి. అలాంటి బజ్‌తో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సినిమాల వార్‌ను ప్రారంభించేందుకు టాలీవుడ్‌లో రెండు సినిమాలు రాగా, అందులో పెద్ద సినిమా ఇదే. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడులైంది.
సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఓటీటీ పార్టనర్ గురించి, టీవీ పార్టనర్ గురించి ఆ మధ్య నిర్మాతలు ఏవేవో రూల్స్ చెప్పారు. అలాగే ఇన్నాళ్ల తర్వాత సినిమా స్ట్రీమింగ్‌కి రావాలి అని కూడా అన్నారు. ఆ రూల్స్ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సినిమాలకు ఓటీటీ పార్టనర్ సంగతి రిలీజ్ రోజే ఇంకా సినిమా పూర్తి కూడా కాకుండానే తెలిసిపోతోంది. అలా ‘గుంటూరు కారం’ సినిమా ఓటీటీ, టీవీ సంగతి తెలిసిపోయింది.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాను త్వరలో (డేట్ చెబుతారు) నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఈ మేరకు ఆ ఓటీటీ సంస్థతో సినిమా టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టెలివిజన్ టెలికాస్ట్ విషయానికొస్తే జెమిని టీవీకి హక్కులు అమ్మేశారు. కాబట్టి సినిమాను ఓటీటీలో చూడాలి అంటే ఆ సబ్‌స్క్రిప్షన్ అవసరం. అలాగే టీవీలో చూడాలంటే ఆ ఛానల్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ సంగతి వాళ్లే చెబుతున్నారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే… అనుకోని పరిస్థితుల్లో బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన తల్లి… తిరిగి చాలా ఏళ్ల తర్వాత కొడుకు దగ్గరకు వస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ కొడుకు ఎలా మారాడు. తల్లి ఎలా వచ్చింది అనేది సినిమా. ఈ క్రమంలో జరిగే పరిణామాల క్రమమే సినిమా. మహేష్ మేనరిజమ్, డైలాగ్ డెలివరీ, శ్రీలీల అందచందాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ సిఇనమా రివ్యూను మన వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!