Guntur Kaaram: గుంటూరు కారం టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్!

  • December 13, 2023 / 04:20 PM IST

బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో మంచి సక్సెస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కూడా ప్రారంభమైంది. అయితే మూడవ సీజన్లో కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే ప్రసారమయ్యాయి అది కూడా బాలయ్య సినిమా ప్రమోషన్ తో పాటు యానిమల్ సినిమా ప్రమోషన్ల కోసం ఈ ఎపిసోడ్లను నిర్వహించారు. ఇకపోతే ఈ కార్యక్రమం మూడవ సీజన్లో భాగంగా మూడవ ఎపిసోడ్ కూడా త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.

ఈసారి బాలయ్య షోలో మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే బాలయ్య టాక్ షో కి మహేష్ బాబు రావడం ఇది రెండవసారి ఈయన మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఈసారి తాను వచ్చేటప్పుడు త్రివిక్రమ్ గారిని తీసుకువస్తానని మహేష్ చెప్పారు.

ఇలా మహేష్ చెప్పిన విధంగానే మరోసారి బాలయ్య షోకి మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి వెళ్తున్నారు అయితే వీరంతా కూడా గుంటూరు కారం సినిమా ప్రమోషన్లలో భాగంగానే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన వెలబడునుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు మూడో సినిమాగా గుంటూరు కారం (Guntur Kaaram) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారు ఇందులో భాగంగానే బాలయ్య టాక్ షోలో కూడా చిత్ర బృందం సందడి చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలను పెంచేశాయి. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus