Gunturu Kaaram: సక్సెస్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్న గురూజీ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం వస్తున్నప్పటికీ సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుందని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమాకు సోషల్ మీడియాలో ఇలాంటి నెగెటివిటీ రావడానికి కారణం ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసినటువంటి నిర్మాత దిల్ రాజు కారణమంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ సినిమా గురించి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ (Gunturu Kaaram) ఈ సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది.. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం దూరంగా ఉన్నప్పటికీ దిల్ రాజు ఆయన సతీమణి అదేవిధంగా నాగవంశీ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి శ్రీ లీల పాల్గొని సందడి చేశారు.

ఇక డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్రివిక్రమ్ ఈ సెలబ్రేషన్స్ లో ఎందుకు పాల్గొనలేదు అంటూ చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమా విడుదల కావడంతో మహేష్ బాబు తదుపరి రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus