Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 6, 2026 / 07:48 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • బ్రహ్మాజీ  (Hero)
  • సురభి ప్రభావతి (Heroine)
  • సన్నీ పల్లె, కిర్నాశ చిట్టం, బన్నీ అభిరాన్, ధ్రువ వాయు, సన్నీ నవీన్, శరణ్య శర్మ   తదితరులు (Cast)
  • విహాన్  (Director)
  • అజయ్ మైసూర్  (Producer)
  • సూరజ్ బరిడా, సందీప్ కుమార్  (Music)
  • ఉదయ్ గుర్రాల  (Cinematography)
  • విహాన్ (Editor)
  • Release Date : 3rd జూలై 2026
  • క్లోరో ఫిలిం & అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ (Banner)

ఈ వారం చాలా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది ‘హ్యాంగ్ మెన్’ అనే సినిమా. సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. బ్రహ్మానందం వంటి స్టార్స్ ఈ సినిమాని ప్రమోట్ చేశారు కానీ.. పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:

Hangman Movie Review

Hangman Movie Review and Rating

కథ: సన్నీ (సన్నీ నవీన్), జ్యోత్స్న (శరణ్య శర్మ) ఇద్దరూ ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతారు. వీరికి ఎంగేజ్మెంట్ అయిన రోజు ఫ్రెండ్స్‌కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చి, తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో కాసేపు ప్రైవేట్‌గా గడపాలనుకుంటారు. అర్ధరాత్రి వేళ వాళ్లు ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో.. వీళ్లని శివయ్య (బ్రహ్మాజీ) అదే పనిగా చూస్తుంటాడు. దీంతో అతను తనని తప్పుగా చూస్తున్నాడేమో అని జ్యోత్స్న అపోహపడుతుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటో వచ్చినా, అందులో శివయ్య ఎక్కుతున్నాడని భావించి ఆమె ఎక్కదు.తర్వాత వచ్చిన బస్సులో ఎక్కుతారు ఈ జంట. అందులో వీళ్లతో పాటు నలుగురు యువకుల గ్యాంగ్ మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో వాళ్లు జ్యోత్స్న, సన్నీలను రెచ్చగొట్టి గొడవకు దింపుతారు. తర్వాత  సన్నీని దారుణంగా కొట్టి.. జ్యోత్స్నపై అఘాయిత్యం చేసి చంపేస్తారు. వీరు చేసిన నేరానికి గాను ఈ నలుగురిని ఉరితీయాలని కోర్టు ఆదేశిస్తుంది.

దీనికోసం తలారి అయిన శివయ్యను రంగంలోకి దింపుతుంది జైల్లో ఉన్న పోలీస్ సిబ్బంది.అయితే జ్యోత్స్నను లైంగికంగా వేధించి చంపేశారని తెలిసిన శివయ్య తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. ఎందుకంటే చూడటానికి ఆమె సరిగ్గా తన కూతురిలాగే ఉండటంతో, మొదట బస్టాండ్‌లో ఆమె కనిపించినప్పుడు శివయ్య అదే పనిగా చూస్తాడు. కానీ జ్యోత్స్న దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటుంది. జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేసిన ఆ నలుగురిని ఉరి తీసే ముందు, వారి ద్వారా సమాజంలో ఉన్న యువత అందరికీ ఓ గుణపాఠం చెప్పాలని శివయ్య ఓ డేరింగ్ స్టెప్ వేస్తాడు. అదేంటి? దానివల్ల శివయ్యతో పాటు అతని కొడుకు శంకర్ (సన్నీ పల్లె), భార్య గంగ (సురభి ప్రభావతి) జీవితాలు ఏమయ్యాయి? అనేది మిగిలిన కథ.

Hangman Movie Review and Rating

నటీనటుల పనితీరు: సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా ఓన్ చేసుకుంటాడు. అయితే ‘హ్యాంగ్ మెన్’ లో అతను చాలా సెటిల్డ్ గా నటించి.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా అతని నటన ఓవర్ ది టాప్ అన్నట్టు ఉండదు. పర్ఫెక్ట్ లీడ్ అనిపించుకున్నాడు. సురభి ప్రభావతి ఎప్పటిలానే తన పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంది. కొడుకు పాత్రలో సన్నీ పల్లె బాగానే సెట్ అయ్యాడు. బాగానే చేశాడు. వంశీధర్ గౌడ్ మినహా మిగతా వాళ్లంతా ఎక్కువ శాతం కొత్తవాళ్లే కావడంతో వాళ్ళ పాత్రలు అంతగా రిజిస్టర్ కావు.

Hangman Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: తలారి వ్యవస్థ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలీదు. ముఖ్యంగా జెన్-జి కిడ్స్‌కి దీనిపై అస్సలు అవగాహన ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ కథను చెప్పాలనుకున్న దర్శకుడు విహాన్‌ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించాలి. కాటికాపరుల మాదిరిగానే ఈ తలారులు కూడా ఒకేలా ఉంటారేమో అని అంతా అనుకుంటారు. కానీ తలారుల ఆలోచనా శైలి ఎలా ఉంటుంది? ఒకరిని ఉరి తీసిన తర్వాత వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? వారిని, వారి వృత్తిని ఉన్నతాధికారులు ఎంత తక్కువ చేసి చూస్తారు? వంటి విషయాలను దర్శకుడు చాలా క్లుప్తంగా వివరించాడు. ఒక్కో వ్యక్తిని ఉరి తీసేందుకు వీరికి కేవలం రూ. 25 ఇస్తారట. ఈ విషయాన్ని బట్టి దర్శకుడు ఈ కథ కోసం ఎంత రీసెర్చ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

‘మనుషులను చంపడం తప్ప బాధపెట్టడం అనేది మా పనికాదు’ అంటూ ఓ సందర్భంలో బ్రహ్మాజీ పాత్రతో చెప్పించిన డైలాగ్లో చాలా డెప్త్ ఉంది. క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. కాకపోతే బడ్జెట్ సమస్యల వల్ల కాబోలు.. సరైన క్యాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. అందువల్లే డైరెక్టర్ టాలెంట్ పూర్తిగా బయటపడలేదు అని చెప్పాలి. ఈ కథను ఇంకాస్త బెటర్ ఇమేజ్ ఉన్న నటీనటులతో తీసి ఉంటే.. కచ్చితంగా బెటర్ రీచ్ ఉండేదేమో. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ సో సోగానే ఉన్నాయి. సినిమా నిడివి గంటన్నర లోపే ఉండటం ఓ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి.

Hangman Movie Review and Rating

విశ్లేషణ: ‘హ్యాంగ్ మెన్’ తో  ‘తలారి’ వ్యవస్థ గురించి ఈ తరానికి వివరించే గొప్ప ప్రయత్నం చేశారు. కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బెట్టర్ క్యాస్టింగ్, బెట్టర్ ప్రొడక్షన్ వాల్యుస్ ఉంటే దీని స్థాయి మరోలా ఉండేది. ప్రస్తుతానికి అయితే ఇదొక మంచి ప్రయత్నమని మాత్రమే సరిపెట్టగలం.

Hangman Movie Review and Rating

ఫోకస్ పాయింట్: హానెస్ట్ అటెంప్ట్

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Bunny Abiran
  • #Hangman Movie
  • #Vihaan
  • #Vinay Nallakadi

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version