హన్సిక నుంచి కొత్త ఛానల్

ప్రస్తుతం సినీ తారలు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. ఈ వేదిక పై అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. మెరిసే స్కిన్ కలిగిన యువ నటి హన్సిక మరో ముందడుగు వేయనుంది. దేశముదురు సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ  బబ్లీ బ్యూటీ త్వరలో యూ ట్యూబ్ చానెల్ పెట్టనుంది. ఈ విషయం పై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫామ్లలో నేను చాల యాక్టివ్ గా ఉన్నాను.

ఇన్ స్ట్రాగ్రామ్ లో నా అకౌంట్ వెరిఫై కాగానే నన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఒక మిలియన్ కి చేరింది. అది నాకు చాలా సంతోషం కలిగించింది. దాంతో నేను అభిమానులకు మరింత దగ్గరగా ఉండాలని ఆలోచించాను. యూ ట్యూబ్ లో చానెల్ ప్రారంభించి నా వీడియోలను అప్ లోడ్ చేస్తాను. యూ ట్యూబ్ వారు దీనికి అవసరమైన టెక్నికల్ అందించడానికి ముందుకొచ్చారు. నా అభిప్రాయాలను, కొత్త సినిమా విశేషాలు, షూటింగ్ సంగతులు, ఆసక్తికర సంఘటనల గురించి అభిమానులతో వీడియోల ద్వారా పంచుకుంటాను. వారి అభిప్రాయాలను తీసుకుంటాను” అని చెప్పారు. ప్రస్తుతం ఈ భామ భోగన్ తమిల్ చిత్రంలో జయం రవితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ లో  భాగంగా హన్సిక విలేకరులతో మాట్లాడారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus