Hansika Wedding: వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైన హన్సిక… పెళ్లి జరిగేది అక్కడే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ తో కలిసి దేశముదురు సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకోవడంతో అనంతరం ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ విధంగా తెలుగులో హీరో రామ్, అల్లు అర్జున్, వంటి హీరోల సరసన నటించారు.

తెలుగులో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు తమిళంలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక తమిళంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి హన్సిక కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ప్రేమయానం చేసినట్లు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలైనట్లు సమాచారం.

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డిసెంబర్ చివరిలో ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. ఇక వీరి వివాహానికి జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ ఈ పెళ్లి వేడుకకు వేదికగా మారనుంది. డిసెంబర్ లో పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కోటలో పెళ్లికి వచ్చే అతిధులకు అన్ని ఏర్పాట్లను ఇప్పటినుంచే ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి హన్సిక ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే హన్సిక వెడ్డింగ్ జరుగుతున్న ముందోట పోర్ట్ ప్యాలెస్‌లోనే గతేడాది ఆమె సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus