తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటివరకు రూ.290 కోట్ల పైనే గ్రాస్ ను కొల్లగొట్టి రూ.150 కోట్ల షేర్ మార్క్ ను దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
4 వారాలు పూర్తయినా ఈ సినిమా జోష్ తగ్గలేదు. ఓవర్సీస్ లో కూడా ఇప్పటికీ మంచి నంబర్స్ చేస్తుంది. ఒకసారి 30 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 37.50 cr |
సీడెడ్ | 11.86 cr |
ఉత్తరాంధ్ర | 11.85 cr |
ఈస్ట్ | 8.10 cr |
వెస్ట్ | 4.29 cr |
గుంటూరు | 4.92 cr |
కృష్ణా | 4.71 cr |
నెల్లూరు | 2.54 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 85.77 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 12.26 cr |
హిందీ | 24.60 cr |
ఓవర్సీస్ | 27.95 cr |
వరల్డ్ వైడ్( టోటల్) | 150.58 cr (షేర్) |
‘హనుమాన్’ (Hanu Man) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 30 రోజులు పూర్తయ్యేసరికి రూ.150.58 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.122.08 కోట్ల లాభాలను అందించింది.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!